31 March, 2026 | 3:36 PM

Breaking News

ఢిల్లీలో భూకంపం

18-02-2025 01:05 AM
  1. రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదు
  2. ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు
  3. కొన్ని సెకన్లపాటు పెద్ద శబ్దం
  4. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దక్షిణ ఢిల్లీలోని ధౌలా కువాన్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీలో, నోయిడా, గురుగ్రామ్, ఘాజియాబాద్ ప్రాంతాల్లో ఉదయం 5.35 గంటల సమయంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే బిహార్‌లోనూ భూకంపం సంభవిం చింది. ఉదయం 8.02 గంటల ప్రాం తంలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

కొన్ని సెకన్ల పాటు భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆసమయంలో భారీ శబ్దం కూడా వినిపించినట్లు స్థానికులు చెప్పారు. కాగా, భూకంపంతో ఆస్తి, ప్రాణనష్టాలపై సమాచారం లేదు. ఢిల్లీ భూకంప జోన్ 4లో ఉందని, రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో కొద్దిపాటి నుంచి బలమైన భూకంపాలు సంభవిస్తూ ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

బూమ్ అనే భారీ శబ్దం ఎందుకొచ్చింది?

ఢిల్లీ, దాని పరిసరాల్లో భూకంపం సంభవించినప్పుడు  కొన్ని సెకన్ల పాటు పెద్ద శబ్దం వినిపించింది. దానికి గల కారణాలను నిపుణులు వెల్లడించారు.  అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా బూమ్ శబ్దం వస్తుందని,  కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా శబ్దాలు వినిపిస్తాయని తెలిపారు.

భద్రతా చర్యలు పాటించాలి: ప్రధాని మోదీ

ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు వ చ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. భద్రతా చర్య లు పాటించాలని ట్వీట్ చేశారు. భూవిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. జాగ్రత్తలు పాటి స్తూ సంసిద్ధంగా ఉండాలని కోరా రు. ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.