calender_icon.png 19 July, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరాఖండ్‌లో భూకంపం

19-07-2025 08:51:30 AM

చమోలీఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భూకంపం (Uttarakhand Earthquake)సంభవించింది. చమోలీలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం, ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగలేదని అధికారులు వెల్లడించారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (National Center for Seismology) ప్రకారం, ఈ రాత్రి 12:02 గంటలకు ఉత్తరాఖండ్‌లోని చమోలిలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ప్రజలు నిద్ర నుండి మేల్కొన్నారు. భూకంపం ధాటికి భయపడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఈ నెల ప్రారంభంలో, జూలై 8న, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించింది. ఆ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా ఉంది. ఎన్సీఎస్ ప్రకారం, ఈ భూకంపం మధ్యాహ్నం 1:07 గంటలకు 5 కి.మీ లోతులో సంభవించింది. దీని కేంద్రం 31.22 N అక్షాంశం,  78.22 E రేఖాంశం వద్ద ఉంది. దానిలో కూడా ఎటువంటి నష్టం జరగలేదు. అదే సమయంలో, ఈ తెల్లవారుజామున టిబెట్‌లో భూమి కంపించింది. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో టిబెట్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రస్తుతానికి భూకంపం కారణంగా ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.