19-07-2025 08:38:59 AM
హైదరాబాద్: పంజాగుట్ట మెట్రో స్టేషన్( Panjagutta Metro Station) కింద పురుగులమందు లోడుతో వెళ్తున్న లారీ డివైడర్ ను ఢీకొని బోల్తా(Lorry Overturns) పడటంతో మైత్రీవనం నుండి పంజాగుట్టకు వెళ్లే రద్దీ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, చుట్టుపక్కల ప్రాంతాలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. తిరగబడిన వాహనం రోడ్డులో ఎక్కువ భాగాన్ని అడ్డుకోవడంతో ప్రయాణికులు ఆలస్యంగా ప్రయాణించారు. పంజాగుట్ట మెట్రో స్టేషన్ కింద ఉన్న అడ్డంకి గురించి ప్రజలను అప్రమత్తం చేస్తూ, అసౌకర్యాన్ని నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించమని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) సోషల్ మీడియాలో ఒక అడ్వైజరీని విడుదల చేశారు. లారీ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.