11 May, 2026 | 9:10 PM

Breaking News

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •   శివంపేట మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ!   •   పాలిసెట్–2026 పరీక్షా ఏర్పాట్లు పూర్తి   •   ప్రధాని మనసు గెలిచిన గరిడేపల్లి 'డప్పు దరువు'   •   జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ అక్షరా శ్రీనివాస్   •   మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం   •   ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   క్షతగాత్రురాలుకి అండగా చేయూత ట్రస్ట్   •   సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •  

హీరో విజయ్ రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు

08-09-2024 03:06 PM

చెన్నై: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన పార్టీని అధికారికంగా నమోదు చేసి, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చిందని తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్ ఆదివారం ప్రకటించారు. తమిళంగా వెట్రి కజగం రాజకీయ పార్టీగా నమోదు కోసం ఫిబ్రవరి 2న భారత ఎన్నికల కమిషన్‌ను సంప్రదించామని, రిజిస్ట్రేషన్‌ మంజూరు అయిందని ఎక్స్ లో ప్రకటించారు. అయితే విజయ్ 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈసీ గుర్తింపుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించింది.

“మన దేశ ఎన్నికల సంఘం దీనిని చట్టబద్ధంగా పరిగణించింది. ఇప్పుడు మా తమిళగ వెట్రి కజగంను రాజకీయ పార్టీగా నమోదు చేసింది. రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడానికి అనుమతించింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అని విజయ్ అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర సదస్సుకు సన్నాహాలు ప్రారంభించామని, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు.