calender_icon.png 1 February, 2026 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎకనామిక్ సూపర్‌కిక్!

01-02-2026 02:26:48 AM

పురోగతిలో రాష్ట్రం 

  1. ఇందుకు ఆర్థిక సర్వేనే తిరుగులేని సాక్ష్యం 
  2. అభివృద్ధి అంటే గాలి మాటలు కాదు
  3. తెలంగాణ బ్రాండ్‌ను దెబ్బతీయవద్దు
  4. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృ త్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్‌బాబు అన్నారు. ఇం దుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఎకనామిక్ సర్వే 2025-26’ నివేదిక తిరుగులేని సాక్ష్యమని, తమ ప్రభుత్వ పనితీరుకు సూపర్ కిక్ ఇస్తోందని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు, పాలనలో పారదర్శకతకు నిదర్శమని, ఇది గణాంకాల పట్టిక కాదని, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రగతి నివేదిక అని మంత్రి పేర్కొన్నారు.

శనివారం సచివాయలంలో మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మా ట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, రాష్ర్టం అన్ని రంగాల్లో వెనుకబడిందని, పెట్టుబడులు రావడం లేదంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ‘విమర్శ’ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు అవసరని, తమ ప్రభుత్వం నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తోందన్నారు.

పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపడం ప్రతిపక్షాల బాధ్యత, విమర్శ అనేది ‘వాస్తవాలకు దగ్గరగా ఉండాలని, రాజకీయ లబ్ధి కోసం ఉండొద్దని మంత్రి హితవు పలికారు. స్వార్థ రాజకీయాల కోసం ‘తెలంగాణ’ బ్రాండ్‌ను దెబ్బతీయవద్దన్నారు. అభి వృద్ధి అంటే గాలి మాటలు కాదని, ప్రజల జీవ న ప్రమాణాలు పెంచడమేనని నిరూపించామన్నారు. ఇకనైనా బురద రాజకీయాలు మాను కుని ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలి.. లేదంటే ప్రజలే మీకు గుణపాఠం చెబుతారు’ అని మంత్రి హెచ్చరించారు. 

దూసుకుపోతున్న తెలంగాణ వార్షిక వృద్ధి

తెలంగాణ వార్షిక వృద్ధిలో దూసుకుపోతుంటే.. రాష్ర్టం వెనుకబడిందంటూ దుష్ర్ప చారం చేయడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సంపదను సృష్టించి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామన్నారు. దేశంలో ఉత్పత్తి రంగంలో కేవలం నాలుగు రాష్ట్రాలు 40 శాతం వాటాను కలిగి ఉంటే.. అందులో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రా ల సరసన తెలంగాణ సగర్వంగా నిలబడిందన్నారు.

ప్రపంచాన్ని శాసించబోయే జెన్-ఏఐ స్టార్టప్‌లలో దేశవ్యాప్తంగా 7 శాతం వాటాతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. బెంగళూరు, ఢిల్లీతో పోటీపడుతూ హైదరాబాద్ స్టా ర్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆర్థిక వ్యవ స్థ అంటే మా ప్రభుత్వ దృష్టిలో కేవలం అంకె లు కాదు, అది మన ఆడబిడ్డల భద్రత, మన యువతకు లభించే ఉపాధి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే మా ప్రభుత్వ ఆకాం క్ష.

అందుకే, మహిళా కార్మికులపై ఉన్న పనివేళల ఆంక్షలను తొలగించామన్నారు. అన్ని రకా ల పరిశ్రమల్లో, అన్ని షిఫ్టుల్లో (24/7) సురక్షితంగా పనిచేసేలా నిబంధనల ను సడలించా మన్నారు. ఇది దేశంలో ఈ సా హసోపేతమైన  నిర్ణయమన్నారు. దేశంలోని వ్యవస్థీకృత తయా రీ రంగంలో 5 శాతం ఉద్యోగాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు.

అన్ని రంగాల్లోనూ హైదరాబాద్..

 హైదరాబాద్‌ను కేవలం ‘ఐటీ’కి మాత్రమే పరిమితం చేయాలన్నది మా ప్రభుత్వ ఆలోచన కాదు. అన్ని రంగాల్లోనూ కేరాఫ్ అడ్రస్‌గా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పం. ఆ దిశగా మేం అడుగులు వేస్తు న్నాం. గుజరాత్‌తో పోటీపడుతూ హైదరాబాద్‌లోని ఫార్మా క్లస్టర్లు ప్రపంచ స్థాయి ప్రమా ణాలను అందుకున్నాయన్నారు.  ఫార్మా క్లస్టర్లు కేవలం పెద్ద కంపెనీలకు మాత్రమే కాదు, ఎంతోమందికి ఉపాధినిచ్చే చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ)  పరిశ్రమలకు కూడా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.

హైదరాబాద్ నగరాన్ని ఒక అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, 8.47 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటుతో 2019- -2035 మధ్య ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెం దుతున్న 4వ నగరంగా మన హైదరాబాద్ రికార్డు సష్టించబోతోందన్నారు. 2018లో 50.6 బిలియన్ డాలర్లుగా ఉన్న హైదరాబాద్ జీడీపీ,, 2035 నాటికి 201.4 బిలియన్ డాలర్లకు చేరుకోబోతోందని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసిందని మంత్రి తెలిపారు.

హైదరాబాద్ ‘ఈజ్ ఆఫ్ లివింగ్-- 2025’ ఇండెక్స్‌లో టాప్ 10 నగరాల్లో ఒకటిగా నిలవడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శమన్నారు.   టెక్నాలజీతో వ్యవస్థలను మిళితం చేసి అవినీతికి చెక్ పెడుతుంటే.. ఓర్వలేక కొందరు మాపై లేనిపోనీ ఆరోపణలను చేస్తున్నారని మండిపడ్డా రు. రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ ‘భూభారతి’ పోర్టల్ ద్వారా భూరికార్డుల నిర్వహణలో విప్లవాత్మక పారదర్శకతను తీసుకువచ్చామన్నారు.

పౌరసరఫరా ల వ్యవస్థలో అక్రమాలకు తావులేకుండా జీపీఎస్ ఆధారిత వీఎల్‌టీఎస్ వ్యవస్థ అమలుతో పాటు రైతు పండించిన ప్రతి గింజ పక్కదారి పట్టకుండా నిఘా పెట్టామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ‘స్మార్ట్ ట్రైబల్ ఫార్మింగ్’ ద్వారా మారుమూల రైతులకు కూడా టెక్నాలజీని అందిస్తున్నామని చెప్పారు. 

ద్రవ్యోల్బణంలోనూ తెలంగాణ మెరుగైన పనితీరు

ఆర్బీఐ నిర్దేశిత పరిమితుల ప్రకారం.. ద్రవ్యోల్బణం ప్లస్/మైనస్ -2శాతం బ్యాండ్‌లో 4 శాతం ఉండాలి. అంటే 2 శాతం నుంచి 6శా తం రేంజ్‌లో ఉండొచ్చు. 2023-24లో ద్ర వ్యోల్బణం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ.. 2024-- 25 నుంచి తెలంగాణ మెరుగైన పనితీరును కనబరిచింది. 2024-25లో జాతీయ సగటు 4.63 శాతం ఉంటే.. తెలంగాణలో 3.67 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(ఏప్రిల్ - నాటి కి) జాతీయ సగటు 1.72 శాతంగా ఉంటే.. తెలంగాణలో 0.20 శాతంగా ఉంది ’ అని తెలిపారు.