01-02-2026 02:18:23 AM
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ సోమవారం నుంచి ఫిబ్రవరి 21 వరకు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తం గా 1440 కేంద్రాలు ఏర్పాటు చేయగా, అం దులో ఎంపీసీ, బైపీసీ, వోకేషనల్ కలిపి మొ త్తం 5,26,192 మంది విద్యార్థులు హజరుకానున్నారు. శనివారం ఇంటర్ బోర్డులో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య పరీక్షల వివరాలను వెల్లడించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్న ట్లు తెలిపారు.
ఎంపీసీ విద్యార్థులు 2,74,007 మంది, బైపీసీ విద్యార్థులు 1,33,415 మంది, వొకేషనల్ విద్యార్థులు 1,18,770 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారన్నారు. పరీక్షల నిర్వహణకు 7559 అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈసారి వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 5 లేదా 6 తేదీల్లో ప్రకటించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రభుత్వ కాలేజీల్లో ఇప్పటికే ల్యాబ్ ఎక్విప్‌మెంట్, పరికరాలు సిద్ధం చేశామని, సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. హాల్ టికెట్లు ఆన్లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ప్రాక్టికల్‌లో ప్రభుత్వ కాలేజీల్లో జంబ్లింగ్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రైవేట్‌లో కూడా చేస్తామన్నారు. కేజీబీవీలకే కాకుండా కొన్ని ప్రభుత్వ రంగ కాలేజీలకు సెంటర్లు కేటాయించలేదని, 34 శాతం మంది ప్రభుత్వ లెక్చరర్లు, 66 శాతం మంది ప్రైవేట్ లెక్చరర్లను ఇన్విజిలేటర్లుగా వాడుకుంటున్నామ న్నారు.
ప్రాక్టికల్‌కు పాస్ మార్కులు 12గా ఉంటాయని, గతంలో ఫెయి ల్ అయిన వారు 400 మంది బ్యాక్ లాగ్ విద్యార్థులు ఫీజు చెల్లించారని, వార్షిక పరీక్షలు రాసే రెగ్యులర్ విద్యార్థులు దాదాపు 10 లక్షల మంది ఉన్నారని తెలిపారు. పరీక్షలు నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్, వెల్‌కమ్ కిట్స్‌ను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుకు చర్యలు చేపట్టామన్నారు.