7 April, 2026 | 3:36 AM

గవర్నర్‌తో విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి భేటీ

07-04-2026 02:15 AM

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాల యాల్లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా అధ్యాపకుల కొరత, నియామకాలు, మౌలికసదుపాయాల సమస్యల గురించి వివరిం చారు. ఉన్నత విద్యలో ప్రవేశపెట్టిన నూతన కోర్సుల గురించి కూడా గవర్నర్‌కు చైర్మన్ వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ‘ఫౌండేషన్స్ అండ్ ఫ్రాంటియర్స్: లా లీగల్ ఎడ్యుకేషన్ అండ్ గ్లోబల్ ఆర్డర్’ అనే పుస్తకాన్ని అందజేశారు.