calender_icon.png 31 October, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాసంస్థల బంద్ విజయవంతం: ఎస్ఎఫ్ఐ

30-10-2025 09:07:50 PM

మణుగూరు (విజయక్రాంతి): పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్స్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మాదాసు అఖిల్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న రూ 8 వేల కోట్ల స్కాలర్షిప్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పెండింగ్ స్కాలర్షిప్ ల నిధులు విడుదల కాకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ స్కాలర్షిప్ నిధులను, కామెస్కాస్మటిక్ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు. లేనియెడల వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని  ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మనోజ్ కుమార్, తేజ, హర్ష, రోహిత్, మోహన్ సాయి, అరుణ్, చరణ్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నా రు.