calender_icon.png 31 October, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశు విక్రయం అక్రమ దత్తతపై అవగాహన..

30-10-2025 09:40:21 PM

చట్టానికి వ్యతిరేకంగా అతిక్రమిస్తే చర్యలు..

మునుగోడు (విజయక్రాంతి): శిశు విక్రయం లేదా అక్రమ దత్తత జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని కల్వకుంట్ల గ్రామం బట్టుగూడెం అంగన్వాడి టీచర్ సింగపంగా మంగమ్మ అన్నారు. గురువారం గ్రామంలోని గర్భిణీ స్త్రీలను కలిసి శిశు విక్రయంపై అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలకు అంగవైకల్యం నివారణపై పలు సూచనలు చేశారు. శిశువులు కావాలనుకునే వారికి చట్టబద్ధమైన దత్తతలు మాత్రమే అనుమతించబడ్డాయని ఆసక్తి గలవారు తప్పనిసరిగా కారా వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు కట్ట లింగస్వామి, పగిళ్ల యాదయ్య, సింగపంగా లింగయ్య, గ్రామ పెద్దలు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు.