వనదుర్గమ్మ సన్నిధిలో గవర్నర్ పీఆర్ఓ
పాపన్నపేట: దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. మంజీరా 'ఏడు' పాయలుగా చీలి ప్రవహించే ప్రసిద్ధ ప్రాంతంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత(Edupayala Vanadurga Mata Temple)ను గవర్నర్ పీఆర్ఓ దశరథం మంగళవారం దర్శించుకున్నారు.
వారికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో వీరేశం ఘనంగా సత్కరించారు. ఆలయ విశిష్టతను వివరించారు. వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన వెంట జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రామచందర్ రాజు, ఏపీఆర్ఓ బాబు రావు, ఆలయ సిబ్బంది ప్రతాపరెడ్డి, సూర్య శ్రీనివాస్, అర్చకులు శంకర శర్మ, రావికోటి పార్థీవ శర్మ తదితరులున్నారు.