25 July, 2026 | 1:51 AM

సవతి తల్లి అసలు సూత్రధారి

25-07-2026 12:37 AM

అస్లాం హత్య కేసును ఛేదించిన పోలీసులు

అంతర్రాష్ట్ర సుఫారి గ్యాంగ్ అరెస్ట్ 

వివరాలు వెల్లడించిన ఎస్పీ

నిర్మల్ జులై 24 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాలనీలో ఈనెల  14న జరిగిన అస్లాం అనే యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితురాలు సవతి తల్లి అని తేలింది. సవతి తల్లితో పెట్టుకున్న అక్రమ సంబంధమే హత్యకు ప్రధాన కారణంగా అంతర్ రాష్ట్ర సుఫారి గ్యాంగ్ తో హత్య చేయించిన కేసును చేదించినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

పట్టణములోని వైయస్సార్ కాలనీ చెందిన అన్సారీ బేగం వరుసకు కుమారుడైన అస్లాంతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నట్టు తెలిపారు. అయితే అస్లాం అక్రమ సంబంధం బయటపడింది.  అస్లాం పెళ్లి చేసుకోవాలని అమ్మాయిని చూశారు. అస్లాంను పెళ్లి చేసుకోవద్దని తనతో ఉండాలని అనుసరి బేగం ఒత్తిడి తెచ్చినట్టు తెలిపారు. దీనికి నిరాకరించడంతో అన్సారీబేగం అస్లాం చంపాలని నిర్ణయించుకుంది. మహారాష్ట్ర కు చెందిన ముఖి గ్యాంగ్ ను సంప్రదించింది.

ఆరు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న అనుసరి బేగం 50,000 నగదు చెల్లించి సుఫారి గ్యాంగ్ ద్వారా అస్లంను అంతం అందించాలని సూచించింది. మహారాష్ట్రకు చెందిన ముకీద్, అప్రోచ్, షేక్ సాహిద్, సాయినాథ్ పవర్, షేక్ మహ్మద్ అని అంతర్రాష్ట్ర సఫారీ గ్యాంగ్ జూన్ 1న నిర్మల్ వచ్చి అస్లాంను ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చంపేందుకు ప్రయత్నించి విఫలమైనట్టు తెలిపారు. జనం ఎక్కువగా ఉండడంతో చివరి నిమిషంలో విరమించుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాత మహారాష్ట్ర వెళ్ళిన ఈనెల 14 నిర్మల్ వచ్చి  అన్సారీ బేగం తో భేటీ అయ్యారు.

చంపటానికి ఒక సఫారీ వాహనం అద్దె తీసుకొని రెండు కత్తులు ఇతర మారణాయుధాలతో నిర్మల్ వచ్చిన వీరు అనుసరి బేగం అస్లాం కదలికలను గ్యాంగ్కు వాట్సాప్ ద్వారా పంపి చంపడానికి కుట్ర పన్నినట్టు తెలిపారు. ప్రయాణికులతో ఆటో నడుపుతున్న అస్లాం ఆటోను అడ్డగించిన సఫారీ గ్యాంగ్ అతన్ని బయటకు లాగి కత్తులతో పొడిచి చనిపోయిన తర్వాత సారంగాపూర్ మీదుగా మహారాష్ట్రకు పరారీ అయినట్టు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిర్మల్ డిఎస్పి శ్రీనివాస్ సిఐ కృష్ణ సంఘటన స్థలం చేరుకుని క్లూస్ టీం ఆధారంగా అనుసరి బేగం ను అదుపులో తీసుకొని విచారించడం జరిగిందన్నారు.

నేను ఒప్పుకోవడంతో సఫారీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ టీం మహారాష్ట్ర వెళ్లి టీం సభ్యులను పట్టుకుని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు వాహనం రెండు కత్తులు స్వాధీనం చేసుకుందామన్నారు. అక్రమ సంబంధంతో యువకుడు చనిపోగా యువతి కుటుంబం కూడా చిన్న భిన్నమైందని ఎస్పీ వెల్లడించారు. కేసు చేదించిన సీఐ కృష్ణ రవీంద్ర నాయక్ ఎస్‌ఐలు లింబాద్రి శ్రీకాంత్ గోపి గణేష్, అశోక్ సాయికృష్ణాలను పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.