30 June, 2026 | 11:58 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి కృషి: రాజ్‌కుమార్‌రెడ్డి

13-05-2025 12:17 AM
  1. కిష్టాపురం ఎస్సీకాలనీలో ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ

డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

నారాయణపేట. మే 12(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపురం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణ భూమి పూజా కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ భూమి పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు.

అంతకుముందు గ్రామస్థులు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో రాజ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు.

రాజ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులను దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్థులు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు గద్దెగూడెం యాదన్న, రామ చందర్, బాలరాజు, వెంకటేష్, అధిక సంఖ్యలో గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.