13-05-2025 12:17:21 AM
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి
గజ్వేల్, మే12: సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం, యోగ సాధన అవసరమని ఎమ్మెల్సీ డాక్టర్ యా దవ రెడ్డి అన్నారు. సోమవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో శ్రీకృష్ణ పంచపాండవ ధ్యాన క్షేత్రంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ బుద్ధుడు సూచించిన అష్టాంగ మార్గాల ద్వారా మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందన్నారు. నేటి మానవాళికి ఆదర్శప్రాయుడన్నారు. సంపూర్ణ ఆరోగ్యకర జీవితానికి యోగాసనాలు, ధ్యానం దివ్య ఔషధంగా పనిచేస్తాయన్నారు.
ఈ సందర్భంగా ధ్యానక్షేత్రం ఏర్పాటుకు స్థలం బహుకరించిన కర్కాల కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు పి నర్సింలు, బాల్ రెడ్డి, రాజిరెడ్డి, డి ప్రభాకర్ వివిధ గ్రామాలకు చెందిన 200 మంది ధ్యానులు హాజరయ్యారు.