27 July, 2026 | 6:05 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలి

09-06-2026 12:49 AM

ఎంపీడీఓ ఝాన్సీ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్ 8:   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రధాన సమస్యలను పరిష్కరిం చేందుకు గ్రామ పాలకమండలి శ్రద్ద వహించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి పి ఝాన్సీ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం మండలంలోని లోయపల్లి, కుంచమర్తి, నాణ్యతండా, పర్సాయిపల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొని మాట్లాడారు.

జలవనురుల సంరక్షణ, మొక్కల పెంపకం, వన మహోత్సవం, సురక్షిత త్రాగునీరు, ఘన వ్యర్ధాల నిర్వహణ, వర్షాకాలం సన్నద్ధత కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. గ్రామాల్లోని రైతులు పంటలు సాగు చేసుకునే సమయంలో వ్యవసాయాధికారుల సలహాలు పాటించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు,మహిళా సంఘాల సభ్యులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.