9 June, 2026 | 1:47 AM

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి

09-06-2026 12:50 AM

కలెక్టర్ తేజస్ నందలాల్  పవార్

సూర్యాపేట, జూన్ 8 (విజయక్రాంతి) : ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత నిచ్చి వాటిని సత్వర మే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం స మీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు.

పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కొత్తగా అం దుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పో ర్టల్లో నమోదు చేయాలన్నారు. అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబందించి 43 దరఖాస్తులు,  డిడబ్ల్యుఓ 4, డీపీఓ 3, మున్సిపాలిటీ 3, వివిధ శాఖలకు సంబంధించి 24  దరఖాస్తులు రాగా మొత్తం 77 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్డిఓ  పి డి సన్యాసయ,  డిఎంహెచ్‌ఓ వెంకటరమణ, పిడి హౌసింగ్ సిద్ధార్థ్, సిపిఓ కిషన్ నాయక్, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, డిఇఓ అశోక్ ,  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.