13 June, 2026 | 2:34 AM

పోలీస్ అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

13-06-2026 01:25 AM

రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్యకు వినతిపత్రం సమర్పించిన అభ్యర్థులు

భద్రాచలం, జూన్ ౧౩ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్త్స్ర అభ్యర్థుల వయోపరిమితిని 37 సంవత్సరాలకు పెంచాలని కోరారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 20 వేల పోలీస్ పోస్టులకు సంబంధించి నియామక నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

గత కొన్నేళ్లుగా నియామకాల ప్రక్రియలో జరిగిన జాప్యా లు, కోవిడ్-19 ప్రభా వం ఇతర కారణాల వల్ల అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యో గ అవకాశాలను కోల్పోయారని వారు పేర్కొన్నారు.  ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అభ్యర్థులు సమర్పించిన వినతిపత్రాన్ని స్వీకరించిన పొదెం వీరయ్య  వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  పోలీస్ నియామకాల కోసం సిద్ధమవుతున్న పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు.