పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ఎండీ ఆసిఫ్ అలీ
అమనగల్లు,జూన్ 12:(విజయక్రాంతి): భూగోళాన్ని కాపాడుకోవడానికి మరియు భావితరాల మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ఎండీ ఆసిఫ్ అలీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమనగల్ బ్లాక్ మండలాల్లో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ ఎండీ ఆసిఫ్ అలీ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆసిఫ్ అలీకి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆసిఫ్ అలీ మాట్లాడుతూ.. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ప్రజాసేవలోనే తనకు నిజమైన తృప్తి ఉందంటూ అభిమానులు, నాయకులు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ జన్మదిన వేడుకల్లో తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గుజ్జుల మహేష్, రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాఘవేందర్, డి.డి.సి అధికార ప్రతినిధి గూడూర్ శ్రీనివాస్ రెడ్డి, గుర్రం కేశవులు, వివిధ గ్రామాల సర్పంచులు భిక్షపతి, చీపునుంతల సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ ఆశన్న, మహేందర్ గౌడ్, బాలరాజ్, ఉటు మహేందర్ పాల్గొన్నారు. అదేవిధంగా ఉపసర్పంచులు యాదగిరి రెడ్డి, దళపతి గౌడ్, మాజీ సర్పంచులు, తాజా మాజీ వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, రేవంత్ మిత్రమండలి సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఆసిఫ్ అలీకి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.






