3 August, 2026 | 1:50 AM

సీసీఐ పునరుద్ధరణకు కృషి చేయాలి

03-08-2026 01:17 AM

- ఎంపినీ కలిసిన సీసీఐ సాధన కమిటీ

ఆదిలాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): సీసీఐ పునరుద్ధరణకు కృషి చేయాలని సీసీఐ సాధన కమిటీ నేతలు ఆదివారం పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ను కలసి వినతి పత్రం అందజేశారు. జూన్15న కేంద్ర మంత్రితో జరిగిన చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించగా రాష్ట్రం సానుకూలంగా లేదని సీసీఐ సాధన కమిటీకి ఎంపీ తెలిపారు. కేంద్రం సైతం సీసీఐనీ రీ ఓపెన్ చేయాలంటే దానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాలని, అందుకోసం తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపినీ కలిసిన వారిలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో కన్వీనర్ విజ్జగిరి నారాయణ, కొండ రమేష్, బండి దత్తాత్రి, చిలుక దేవిదాస్, జగన్ సింగ్, అరుణ్ కుమార్, అన్నమొల్ల కిరణ్, ఈశ్వర్ దాస్, ప్రశాంత్, విఠల్, దాసరి రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు .