3 August, 2026 | 1:49 AM

బీఆర్‌ఎస్‌లోకి మేడిపల్లి, పీర్జాదిగూడ యువత

03-08-2026 01:18 AM

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మేయర్ వెంకట్ రెడ్డి

మేడిపల్లి, ఆగస్టు 2 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లకు చెందిన సుమారు 40 మంది యువకులు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. మాజీ కో-ఆప్షన్ సభ్యులు నాజియా జావిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పీర్జాదిగూడ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో  మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి యువతకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జక్క వెంక ట్ రెడ్డి మాట్లాడుతూ& దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతలోనే ఉందని అన్నారు.   కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా యువత మళ్లీ బీఆర్‌ఎస్ వైపు ఆకర్షితులవుతోందని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న పోరాటానికి యువత మద్దతు తెలుపుతోందని, అందుకే పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్లో చేరుతున్నారని జక్క వెంకట్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్  ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు రఘుపతి రెడ్డి, మహేష్, మధుసూదన్ రెడ్డి, పోచయ్య, మహిళా అధ్యక్షురాలు నిర్మల, మైనారిటి అధ్యక్షులు జిలాని పాషా, మధుకర్, శ్యామల, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.