తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి కృషి చేయాలి
టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి రవీందర్ గుప్తా
కామారెడ్డి, జులై 19 (విజయ క్రాంతి): తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కామారెడ్డి నియోజవర్గ టిఆర్‌ఎస్ ఇన్చార్జి నంగు నూరి రవీందర్ గుప్తా అన్నారు. ఆయన కామారెడ్డిలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ గుప్తా మాట్లాడుతూ కామారెడ్డి ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కామారెడ్డి నియోజవర్గంలో అన్ని మండల, గ్రామ కమిటీలు వేసి వాటిని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని ఆరోపించారు. కామారెడ్డి ప్రభు త్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడుతున్న అధికారులతో పాటు ప్రజా ప్రతి నిధులు పట్టించుకోవడంలేదని మండిపడ్డా రు.
అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎలాంటి పనులు జరగడంలేదని పేర్కొన్నా రు. టిఆర్‌ఎస్ పార్టీ పంచ జన్యం పేరుతో ప్రజలకు సేవలు చేస్తూ ముందుకు వెళ్తుందని అన్నారు. అధికారంలోకి రాగానే వాటి ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు అరుణ్, మధు సాన తదితరులు పాల్గొన్నారు.






