తెలంగాణ రక్షణ సేన యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కంచి ప్రవీణ్ ముదిరాజ్ నియామకం
20-07-2026 12:00 AM
ముషీరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కంచి ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితను కలిసి పూల బొకే ను అందజేసి కృతజ్ఞతలు తెలిపినట్లు కంచి ప్రవీణ్ తెలిపారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతిలో హైదరాబాద్ నగర అధ్యక్షునిగా పని చేసి మంచి గుర్తింపు పొంది విద్యార్థి దశలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసిన తన పనిని గుర్తించి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్కకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు కు సహకరించిన పార్టీ మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.






