26 April, 2026 | 4:44 PM

కేసుల సతర పరిష్కారానికి కృషి చేయాలి

12-08-2024 12:05 AM
  1. హైకోర్టు న్యాయమూర్తి వినోద్‌కుమార్ 
  2. బోథ్‌లో కోర్టు భవనానికి భూమిపూజ

ఆదిలాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా చూడాలని హైకోర్టు న్యాయమూర్తి వినోద్‌కుమార్ సూచించారు. హైకోర్టు న్యాయమూర్తులు సుజన, లక్ష్మణ్‌లతో కలిసి ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. బోథ్ మండల కేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టు భవనం, న్యాయమూర్తుల నివాసాల భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కోర్టు భవనం, రెసిడెనియల్ భవన నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయాధికారి ప్రభాకర్‌రావు, కలెక్టర్ రాజరిషా, ఎస్పీ గౌస్ ఆలం, బోథ్ న్యాయాధికారి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.