calender_icon.png 10 November, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ప్రోత్సహించేందుకు కేంద్రం కృషి

12-08-2024 12:00:00 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఆగస్టు 11 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం చైర్మన్ పాకాల పురుషోత్తంరెడ్డి, పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడిబుల్ టీ కప్పుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

అనంతరం మానకొండూర్ మహాకాళి గుడిలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రంగు భాస్కరాచారి, మండలాధ్యక్షుడు రాపాక ప్రవీణ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మియాపురం లక్ష్మణచారి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సున్నాకుల శ్రీనివాస్, నాయకులు బాషబోయిన ప్రదీప్‌యాదవ్, కోండ్ర సురేష్, ఆరెపల్లి ఆనంద్, కోండ్ర శంకర్, వెంకటస్వామి పాల్గొన్నారు.