calender_icon.png 4 February, 2026 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచార అస్త్రంగా ‘సోషల్’ ట్రెండ్

04-02-2026 12:00:21 AM

వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు 

పోస్టింగ్ చేసేందుకు ప్రత్యేక టీంలు

ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు

సంగారెడ్డి, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): ఎన్నికల ప్రచారపంథా మారుతోంది. గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి తాము ఏమి చేయాలనుకుంటు న్నారో తెలిపి వారి మద్దతు కోరేవారు. ప్రస్తు తం మున్సిపల్ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో సోషల్ మీడియాను ప్ర ధాన ప్రచారంగా మార్చుకుంటున్నారు. ఫే స్బుక్, ఇన్స్ట్రాగ్రాం, వాట్సాప్ వంటి ఫ్లాట్ ఫాంలలో తమ రోజువారీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందుకోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని నియమించుకుంటున్నారు. మరికొంత మంది ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యే క పాటలు రూపాందించుకొని ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రీల్స్ ద్వారా ఓటర్ల ఫోన్లకు వీడియో, ఆడియో రూపంలో సందే శం పంపిస్తున్నారు. నోటిఫికేషన్ ముందు నుంచే మొదలైన సోషల్ మీడియా ప్రచారం ఉపసంహరణ ముగిసిన నేపథ్యంలో మ రింత ముమ్మరం కానుంది.

సోషల్ మీడియానే ఆయుధంగా...

ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెం డెంట్ అభ్య ర్థులు సైతం ప్రచార ఆయుధంగా సోషల్ మీడి యాను ఎంచుకుంటు న్నారు. నోటిఫికేషన్ కు ముందు నుంచే తమ రోజువారీ కార్యక్రమాలను అందులో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫొటో, వీడియో గ్రాఫర్లను ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా కాలనీ పెద్దలు, అధికారులను కలవడం, సామాజిక సేవ కార్యక్రమాలు వంటి వాటిని చిత్రీకరించేలా ఉదయం నుంచి రాత్రి వరకు తమ వెంటే ఉంచుకుంటున్నారు.

ఆయా ఫొటోలు, వీడియోలతో ప్రత్యేక రీల్స్ రూ పొందిస్తున్నారు. వాటికి ఆడియో, వీడియోల రూపంలో సిద్ధం చేసి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ఫ్రాగాంలలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఇందుకోసం కం ప్యూటర్ పరిజ్ఞానం కలిగిన యువతను ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియాలో తమ ప్రచారాన్నిహోరెత్తించే బాధ్యతలు వారి కి అప్పగించారు. ఒక్కొక్కరికి రూ.20వేల నుంచి రూ.25వేల వేతనం చెల్లిస్తున్నారు.

ప్రత్యేకంగా పాటల రూపకల్పన..

ఓటర్లను సులువుగా ఆకట్టుకునేందు కోసం పలువురు అభ్యర్థులు ప్రత్యేకంగా పా టలను తయారు చేయించుకుంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల తరహాలో ఖర్చుకు ఏమా త్రం వెనుకాడడం లేదు. పేరున్న గాయకులతో పాటు ఉమ్మడి జిల్లాల్లోని పలువురు కళాకారులను సంప్రదిస్తున్నారు. ఒక్కో పాటకు రూ.10వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లిస్తూ ప్రత్యేకంగా రాయించుకుని పాడిస్తున్నారు. ప్రచారంలో ఈ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.