10 June, 2026 | 5:14 PM

అర్హులు అయినవారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి

10-06-2026 04:42 PM

బోథ్,(విజయక్రాంతి): అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని బోథ్ గ్రామ సభలో పలువురు కోరారు. బుధవారం బోథ్ గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామసభను గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సమావేశంలో గ్రామ సమస్యలను పలువురు సభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో మురికి కాలువల నిర్మాణం అవసరమున్న చోట నిర్మించాలని పలువురు వార్డు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు.

వర్షాకాలంలో మురుగు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అంతేగాక ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు కేటాయించాలని రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా కమిటీ వారు ఇండ్లు మంజూరు ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఈవో అంజయ్య ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ సహకార సంఘం డైరెక్టర్ చట్ల ఉమేష్ ఉప సర్పంచ్ విజయలక్ష్మి వార్డు సభ్యులు షేక్ షాకీర్ తిరుపతి పద్మారావు సోహెల్ తదితరులు పాల్గొన్నారు