సమస్యల పరిష్కారానికి చర్యలు
10-06-2026 04:38 PM
విద్యుత్ దీపాలు మరమ్మత్తులు చేయిస్తున్న సర్పంచ్ సతీష్
వాంకిడి,(విజయక్రాంతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సతీష్ అన్నారు. బుధవారం వాంకిడి మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ వార్డులో విద్యుత్ దీపాలకు ఆయన మరమ్మత్తులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి వార్డులో విడుతల వారీగా అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు చేపడుతానని స్పష్టం చేశారు.






