4 August, 2026 | 1:53 AM

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

04-08-2026 12:00 AM

కేసముద్రం, ఆగస్టు 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హాయంలో గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు డీసీసీ అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కేసముద్రం మండలం భూక్యారం తండా గ్రామంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ 17 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయగా, సిమెంట్ రోడ్ల పనులను సర్పంచ్ జాటోత్ సోమీ ప్రారంభించినారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేందర్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి ప్రజా పాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యే మురళి నాయక్ పల్లెలల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.

దళారులను నమ్మొద్దు

రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం ను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని ప్రకటించడం జరిగిందని, ఇచ్చిన హామీ మేరకు గ్రామాలలో అధికారులతో సర్వే చేయించి గుడిసెలు ఉన్న వారిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా గుర్తించి పార్టీలకతీతంగా జాబితా రూపొందించడం జరుగుతుం దన్నారు. అయితే గ్రామాల్లో కొంతమంది దళారులు ఇండ్లు మేమే ఇస్తాం అని చెబుతూ ప్రభుత్వo యొక్క పథకాన్ని పక్కదారి పట్టించే విధంగా పేదలకు మాయమాటలు చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మవద్దని మహేందర్ రెడ్డి కోరారు.

పేదల గుర్తింపు పూర్తిగా అధికారుల సమక్షంలో, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరుగుతుందని అనంతరం అర్హులైన వారికి ఎమ్మెల్యే, జిల్లా ఇంచార్జ్ మంత్రి సంతకాలతోని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరికి కూడా డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. 

ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది కాబట్టి  దళారులకు డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాకావత్ ఖండియా, గ్రామ పార్టీ అధ్యక్షుడు జాటోత్ రమేష్, భూక్య శ్రీనివాస్, మిట్ట గడుపుల యాకూబ్, జాటోత్ సంతోష్, భూక్య వెంకన్న, అంగన్వాడి టీచర్  సలీమా పాల్గొన్నారు