calender_icon.png 2 February, 2026 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తకొండ ఆలయ అభివృద్ధికి కృషి

02-02-2026 12:00:00 AM

ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కొత్తకొండ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే వరంగల్ బసవరాజు దంపతులు స్వామి వీరన్న భద్రకాళి దేవికి మొక్కులు చెల్లించారు. ఆదివారం విశేషమైన వీరభద్రుని రోజు పౌర్ణమి సందర్భంగా కొత్తకొండ వీరన్నకు కోడె మొక్కును చెల్లించి, గుమ్మడికాయను తలపై పెట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి కొత్తకొండ వీరన్న కు గుమ్మడికాయ, కోర మీసం సమర్పించి, అభిషేకము, స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన చేశారు.

దేవస్థానం తరుపున కార్యనిర్వానాధికారి పి. కిషన్ రావు తో ఫోన్ లో మాట్లాడి ఎమ్మెల్యే బసవరాజు సారయ్య దంపతులు కొత్తకొండకు వస్తున్నారని ముఖ్య అర్చక రాంబాబుతో మాట్లాడి ఎమ్మెల్సీ దంపతులను ఘనంగా స్వాగతించి దేవాలయ దర్శనానంతరము తీర్థప్రసాద వితరణ దేవస్థానం తరుపున శేష వస్త్రంతో సన్మానించారు. ముల్కనూర్ సబ్ ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా బసవరాజు దంపతులకు ఎమ్మెల్సీ వరంగల్ దగ్గర ఉండి బందోబస్తు నిర్వహించారు. దంపతుల ఇద్దరికీ ఘనంగా వేద ఆశీర్వాదములు ఇచ్చిన కొత్తకొండ దేవాల య ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, గుడ్ల శ్రీకాంత్ , తాటికొండ వీరభద్రయ్య, అర్చక కంచన పెళ్లి శరత్ చంద్ర, అర్చకులు ఘనంగా ఆశీర్వదించారు.