02-02-2026 12:00:00 AM
మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణపై భగ్గుమన్న బీఆర్‌ఎస్
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన
వరంగల్/ హనుమకొండ/జనగామ/ములుగు/మహబూబాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయ కుండా, ఆరు గ్యారెంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చిన హామీ గాలికి వదిలేసి, పాలన చేతకాక ప్రశ్నించే గొంతును నొక్కిందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సి ద్వారా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారని విమర్శిస్తూ ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ శ్రేణు లు బగ్గుమన్నాయి. మండల కేంద్రాల నుం డి మొదలుకొని డివిజన్, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ తీరును విమర్శిస్తూ నిరసనలు చేపట్టారు. అనేక చోట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి శవయాత్రలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేత లు మాట్లాడుతూ ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ అధికార పార్టీని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో విచారణ పేరుతో ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమ లు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పరిపాలన చేతకాక తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బీఆర్‌ఎస్ నేతలపై తప్పుడు కేసులు బనాయించి, అధికారాన్ని అడ్డం పె ట్టుకొని విచారణ పేరుతో ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం పాలు కాక తప్పదని తెలుసుకొని, బీఆర్‌ఎస్ నేతలను భయపెట్టే విధంగా కేసీఆర్ ను విచారించడం ఇందులో భాగంగా పేర్కొన్నా రు. ఎవరు ఎంత భయపెట్టిన, మున్సిపల్ ఎన్నికల్లో పోరాటమే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని, తెలంగాణ సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై పెట్టిన కేసులన్నీ ఎదుర్కొని తీరుతామన్నారు. ఎక్కడ కూడా తప్పు చేయలేదని, తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు నీళ్లు, నిధులు, నియామకాల కోసం అధికారంలో ఉన్న 10 ఏళ్ల పా టు కృషి చేసినట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
సిట్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చెసి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన ఎమ్మె ల్సీ తక్కెళ్లపల్లి రవిందర్ రావు పాల్గొన్న పార్టీ ముఖ్య నాయకులు , కార్యకర్తలు , తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.