02-02-2026 12:00:00 AM
ఏపీ జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ న్యాయ సభ్యులు వేమిరెడ్డి భాస్కర్‌రెడ్డి
ముషీరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): దేశంలోని పన్నుల రంగంలో క్రాస్ బోర్డర్ టాక్సేషన్ ఎంతో కీలకం అని ఏపీ జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ న్యాయ సభ్యు లు వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్లోని హోటల్ తాజ్ ట్రైస్టార్ లో ‘క్రాస్ బోర్డర్ టాక్సేషన్‘ అనే అంశంపై తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ స్పీకర్ మీట్ నిర్వహించింది.
ఈ స్పీకర్ మీట్ లో వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ భారతదేశంలో సరిహద్దు లావాదేవీలను నియం త్రించే పన్ను చట్టాల సంక్లిష్టతల కారణంగా విదేశాలలో వ్యాపారం చేయడం ఒక కష్టతరమైన, సవాలుతో కూడిన పని అని, అందు వల్ల సంస్థలు తామ కార్యకలాపాలు నిర్వహించే వివిధ దేశాల పన్ను వాతావరణం, చట్టాల గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండ టం చాలా ముఖ్యం అని అన్నారు.
ఫిబ్రవరి 21న హైదరాబాద్, బిర్లా ప్లానిటో రియంలోని భాస్కర ఆడిటోరియంలో మూట్ ట్రిబ్యునల్ పోటీలు, ఫిబ్రవరి 5న యూనియన్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించ నున్నట్లు ప్రకటించారు. అనంతరం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ న్యాయ సభ్యుడిగా నియమితులైన వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి ని శాలువా, ఫూలమాలలతో ఘనంగా సత్కరించారు.
అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ వేముల, అసోసియేషన్ కార్యదర్శి ఆశిష్ జోషి, పూర్వ అధ్యక్షులు సిఏ హితేష్ జైన్, సలహాదారులు రామ్దేవ్ భుటాడా, అమృత్ కుమార్ కోట, ఉపాధ్యక్షులు నారాయణ రావు, కార్యవర్గ సభ్యులు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, పన్నుల రంగానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్లు, అడ్వొకే ట్లు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లు పాల్గొన్నారు.