28 June, 2026 | 2:56 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

చెన్నూర్ లో వైద్య సేవల అభివృద్ధికి కృషి

31-03-2025 07:59 PM

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్..

మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు నియోజకవర్గంలో వైద్య సేవల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నియోజకవర్గంలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో వన్ మెడి హబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. మొబైల్ మెడికల్ క్యాంపులో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని గ్రామీణులు, పట్టణ ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు.

ముఖ్యంగా ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకొని పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు వన్ మెడి హబ్ సంస్థ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, వైద్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.