22 April, 2026 | 1:15 PM

Breaking News

ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •  

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి

10-09-2024 04:43 AM
  1. క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతాం 
  2. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ 
  3. సీపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): నగరంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సీపీగా రెండోసారి సోమవారం సీపీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. సమర్థవంతమైన పోలీసింగ్‌తో నేర నియంత్రణ చేస్తామని, శాంతి భద్రతలను మెరుగుపరుస్తామన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని చెప్పారు. నగరంలో వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తు న్నట్లు వివరించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.