31 July, 2026 | 1:55 AM

అత్యవసర పరిస్థితులలో ప్రజలకు అందుబాటులో ఉంటాం..

31-07-2026 01:02 AM

మంత్రి వివేక్ వెంకట స్వామి

మందమర్రి, జూలై 30: వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. గురువారం మందమర్రి మున్సిపల్ పరిధిలోని 19, 7 వార్డులలో నెలకొన్న స్థితులను కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సేవలను అందించేందుకు అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ మందమర్రి మున్సిపల్ కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్, మండల తహసిల్దార్ సతీష్ కుమార్ తో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఎన్యుమరెషన్ ఫారాలా డిజిటలైజేషన్ త్వరగా పూర్తిచేసే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంకా ఫారాలు అందించని వారిని గుర్తించి బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా సేకరించే విధంగా పర్యవేక్షించాలని తెలిపారు.