17 July, 2026 | 8:52 PM

Breaking News

సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •  

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

21-09-2024 01:44 AM

తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి అన్నారు. శనివారం డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ (డీసీఏ) కార్యాల యంలో తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ స్పౌ జ్ ఫోరం ప్రతినిధులు లచ్చిరెడ్డిని కలిసి జేఏసీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ జేఏసీ పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఎంప్లాయిస్ స్పౌజ్ ఫోరం ప్రతినిధులు లచ్చిరెడ్డిని సన్మానించి అభినందించారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, జేఏసీ నాయకుడు రామకృష్ణ, ఫోరం అధ్యక్షుడు ఎస్ వివేక్, విజయలక్ష్మి, వనజ పాల్గొన్నారు.