12 August, 2026 | 11:30 AM

దేవాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

12-08-2026 09:18 AM

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య....

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట  శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్  ఉద్యోగ భద్రత, సంక్షేమానికి సంబంధించిన పలు కీలక డిమాండ్లలకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని  ప్రభుత్వ విప్  అయిలయ్య భరోసానిచ్చారు.  మంగళవారం శుభం గార్డెన్ లో అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్  ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించి, ఉద్యోగుల సంక్షేమానికి బాసటగా నిలవాలని తెలిపారు. ఈ సందర్భంగా  ప్రభుత్వ విప్ మాట్లాడుతూ 

యాదగిరిగుట్ట   దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను బోర్డు దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించి, 15 రోజుల వ్యవధిలో సమస్యల పరిష్కారంలో స్పష్టమైన పురోగతి సాధించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని అన్నారు. దేవస్థానంలో సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కో-ఆపరేటివ్ చైర్మన్ చీర శ్రీశైలం, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది  పాల్గొన్నారు.