12 August, 2026 | 10:07 AM

సీజనల్ వ్యాధుల వైద్యుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

12-08-2026 09:16 AM

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు రక్త పరీక్షలు నిర్వహించాలి

 జిల్లా డిఎంహెచ్వో తుకారం రాథోడ్

ఆళ్లపల్లి,(విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండాలని సహజ ప్రసవాల సంఖ్యను పెంచాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, రక్త పరీక్షలు నిర్వహించాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ తుకారం రాథోడ్ అన్నారు. తొలుత వైద్య సిబ్బంది విధుల రిజిస్టర్లు పరిశీలించి, మౌలిక వసతులు పనివిధాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి, స్టాప్ సిబ్బంది హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు. వైద్య కేంద్ర పరిసర ప్రాంతాలు పరిశుభ్రత పారిశుధ్యం పట్ల ఆరాతీసిసిబ్బందికి ప్రత్యేక అవగాహన కల్పించారు.

ఆరోగ్య వైద్యకేంద్రంలో మాత్రల నిలువలు, ఎన్ఎస్ సెలైన్ బాటిల్, ఓఆర్ఎస్, ఇంజక్షన్లు పరిశీలించారు. జాతీయ వైద్య ఆరోగ్య కార్యక్రమాలు వివరించారు. అనంతరం డిఎంహెచ్ ఓ తుకారం రాథోడ్ మాట్లాడుతూ పిహెచ్సిలో సహజ ప్రసవాల సంఖ్య పెంచాలని,వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు సేవలను విసృతంగా అందించాలని సూచించారు. గర్భిణీలకు సంబంధించి వివిధ రికార్డులు తనిఖీచేసి గర్భిణికి తప్పనిసరిగా రక్తహీనత (అనీమియా) పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్న గర్భిణులకు అవసరమైన మందులు, పోషకాహార సలహాలు అందించి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రసవాల గదిని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రసవాలకు వచ్చే గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిమౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని,పరిశుభ్రతను పాటిస్తూ నాణ్యమైనవైద్య సేవలందించాలని వైద్యాధికారులకు ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా డెంగ్యూ,మలేరియా విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం, జలుబు, వళ్ళునొప్పులతో ఆసుపత్రికి వచ్చే రోగులకు ఖచ్చితంగా రక్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఎంఅండ్హెచ్ఓ వైద్యులు ప్రతాప్, స్థానిక ప్రభుత్వ వైద్యులు గోపిలాల్, హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి, హెచ్ఇఓ రామకృష్ణ, ఎల్టి పార్వతి, జూనియర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్ సునీత, ఫార్మసిస్ట్, ఎస్ఎన్ఓ తదితరులు పాల్గొన్నారు.