25 February, 2026 | 11:16 AM

మెడికల్ కాలేజీల సమస్యల పరిష్కారానికి కృషి

25-02-2026 12:43 AM
  1. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ
  2. మెడికో పేరెంట్స్ అసోసియేషన్ క్యాలండర్‌ను ఆవిష్కరించిన మంత్రి   

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించ డంలో, ఇతర సమస్యలను పరిష్కరించడంలో సహాయం అందిస్తున్న తెలంగాణ మెడికో పేరెంట్స్ అసోసియేషన్‌ను రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభి నందించారు అసోసియేషన్ సభ్యులు మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహను బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

అసోసియేషన్ 2026 క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్క రించారు. ఈ సందర్భంగా సభ్యులు రాష్ర్టం లో వివిధ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి మెడికల్ కాలేజీల్లో  సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, సభ్యులు పొడిెట్టి రమేష్,  కట్ట వెంకటరావు, శ్రీనివాస్, రత్న ప్రసాద్, బొడ్డుపల్లి సుజాత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.