4 May, 2026 | 4:04 PM

Breaking News

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!   •   మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •  

రైతు సమస్యల పరిష్కారానికి కృషి

03-11-2024 12:07 AM

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ముందుం టుందని కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో కమిషన్ తొలి సమావేశం జరిగింది. ఇందులో వ్యవసాయ రం గానికి చెందిన పలువురు నిపుణుల నుంచి సూచనలు, సలహాలు తీసుకు న్నారు.

ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్ష లాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఒక్కొటిగా పరిష్కరిస్తోంద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని, దేశ చరిత్రలో కనివినిఎరుగనీ రీతిలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వివిధ రాష్ట్రాల నుంచి ప్రశంసలు పొందు తుందని తెలిపారు.

త్వరలో రైతు భరోసా, రైతు బీమా, పంటరుణాలు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. సాం ప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపే లా అవగాహనా కార్యక్రమాలు నిర్వ హిస్తామని వెల్లడించారు. ఈ కార్య క్రమంలో రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్, కన్నెగంటి రవి, లుబ్నా సర్వత్ పాల్గొన్నారు.