వరల్డ్‌కప్‌లో ఈజిప్ట్ సంచలనం
23-06-2026 12:00 AM
టోర్నీ చరిత్రలో తొలి విజయం
వాంకోవర్: సాకర్ ప్రపంచకప్‌లో ఈజి ప్ట్ సంచలనం సృష్టించింది. తమ చరిత్రలోనే తొలిసారి వరల్డ్‌కప్‌లో విజయాన్ని రుచి చూ సింది. గ్రూప్ జిలో భాగంగా జరిగిన మ్యాచ్ లో 3 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి గోల్ చేయగా... సెకండాఫ్‌లో ఈజిప్ట్ అదరగొట్టింది.
ఏకంగా మూడు గోల్స్ కొట్టి తిరుగులేని విజయాన్ని అందుకుంది. 58న నిమిషంలో ఈజిప్ట్ ప్లేయర్ జీకో ఫ్రీ హెడర్ గోల్ చేయగా... తర్వాత 9 నిమిషాలకే సలా హ్ మరో గోల్ సాధించాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకూ కాపాడుకున్న ఈజిప్ట్ 82వ నిమిషంలో ట్రెజెగెట్ మూడో గోల్ కొట్టి విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో 92 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈజిప్ట్ గెలిచింది.






