23 June, 2026 | 1:32 AM

ఉరుగ్వేకు కేప్ వెర్డే షాక్

23-06-2026 12:00 AM

మియామీ, జూన్ 22: ఫిఫా వరల్డ్‌కప్‌లో కేప్ వెర్డే  సంచలనం నమోదు చేసింది. ఊహించని విధంగా ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌ను 2 డ్రాగా ముగించింది.  ఈ ఫిఫాలో తొలిసారి ఆడుతున్న కేప్ వెర్డే వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శ నతో ఆశ్చర్యానికి గురిచేసింది. గత వారం టోర్నమెంట్ ఫేవరెట్ స్పెయిన్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన ఈ పసికూన, తాజాగా రెండుసార్లు ప్రపంచ కప్ విజేత ఉరుగ్వేపై కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది.

స్టాఫ్‌లో ఉరుగ్వే రెండు గోల్స్, కేప్ వెర్డే ఒక గోల్ సాధించాయి. ఆ జట్టు తరఫున అరా వ్జో (44వ), అగస్టిన్ కానోబియో (45+6 వ) నిమిషంలో, కేప్ వెర్డే (21 వ) గోల్స్ సాధించారు. దీంతో తొలి అర్ధ భాగంలో ఉరుగ్వే 2- లీడ్‌లో నిలిచింది. సెకండాఫ్‌లో కేప్ వెర్డే పుంజుకున్న తీరు అద్భుత మ నే చెప్పాలి. ఆ జట్టు హీలియో వరేలా (61 వ) నిమిషంలో గోల్ సాధించడంతో సోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత ఏ జట్టు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ డ్రా అయ్యింది.