1 April, 2026 | 8:12 AM

విపక్ష ఎంపీలు సస్పెండ్‌

03-02-2026 03:39 PM

న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్ సభ రేపటికి వాయిదా(Lok Sabha Adjourned ) పడింది. లోక్ సభలో మంగళవారం మరోసారి గందరగోళం నెలకొంది.  విపక్ష సభ్యులు లోక్ సభ స్పీకర్  పై కాగితాలు విసరడంతో పాటు, క్రమశిక్షణారాహిత్య ప్రవర్తనకు గానూ లోక్‌సభ నుంచి ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ సెషన్ మొత్తం సస్పెండ్  చేశారు. సస్పెండ్ అయిన ఎనిమిది మందిలో హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణికం ఠాకూర్, గుర్జీత్ సింగ్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై సస్పెషన్ వేటు పడింది.

ఈ ఘటనను స్పీకర్ ఖండిస్తూ, ఇది పార్లమెంటరీ మర్యాదను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఇటువంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. లోక్‌సభ వాయిదా పడిన తర్వాత, పదే పదే అంతరాయం ఏర్పడి, సభాధ్యక్షుడిపై కాగితాలు విసిరేయడం వంటి చర్యలు తీసుకోవడంతో పాటు, వికృత ప్రవర్తనకు దారితీసిందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్డీయే కోరింది.