calender_icon.png 8 November, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఇంగ్లీష్ ఫెయిర్

08-11-2025 08:20:30 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): విజయరత్న కేవలం విద్యాబోధనే కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, నైపుణ్యతను వెలికి తీయడానికి ఎప్పుడు ముందుంటుందని విజయ రత్న పాఠశాల డైరెక్టర్స్ విజయ్ సేనారెడ్డి, నరేంద్రనాథ్, నరసింహా రావు, శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. పోచారం మున్సిపల్ చౌదరిగూడ విజయపురి కాలనీలోని విజయరత్న పాఠశాలలో ఏఐ టెక్నాలజీతో రోబో, రోజు వారి జీవితంలో సెల్ ఫోన్ వినియోగం, మాతృ బాషద్వారా ఇతర భాషలు నేర్చుకోవడం ఇలా విద్యార్థులు సృజనాత్మకతతో తయారు చేసిన ఎన్నో రకాల ప్రాజెక్ట్ తో కూడిన ఇంగీష్ ఫెయిర్ కార్యక్రమాన్ని శనివారం వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించి విజయం అందుకొని విలువైన రత్నాలుగా దేశాన్నికి అందించడానికి విజయరత్న పాఠశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుంని తెలిపారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ను యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాన్యం కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.