10 April, 2026 | 3:30 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

12-02-2026 07:42 PM

అదనపు కలెక్టర్ నగేష్

పాపన్నపేట: మహా శివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధిలో 15 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే మహా జాతర పనులను గురువారం సాయంత్రం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు. జాతర పరిసర ప్రాంతాలను వివిధ శాఖల అధికారులతో కలిసి కాలి నడకన తిరిగి పరిశీలించారు. పూర్తికాని పనులపై అధికారులను ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రంలోగా వివిధ శాఖలకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వీరి వెంట ఆలయ ఈవో వీరేశం, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.