11-11-2025 06:48:56 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు(సుల్తానాబాద్)లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వృద్ధురాలు మృతిచెందింది. సిర్గాపూర్ ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొక్కస్గాంకు చెందిన మతిస్థిమితం లేని వడ్డే నాగమ్మ(74) సోమవారం సాయంత్రం పక్కనే ఉన్న నల్లవాగు డ్యాంలో స్నానం చేసేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగింది. అయితే మంగళవారం మధ్యాహ్నం మృతదేహం నీటిపై తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగ శవాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు పంపారు.