calender_icon.png 11 November, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటికి తిరిగి క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తాం..

11-11-2025 06:45:53 PM

బోడుప్పల్ కమిషనర్ శైలజ..

మేడిపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని నగరపాలక సంస్థలను క్షయ వ్యాధి రహితంగా మార్చడానికి చేపట్టిన "స్వాస్థ్య నగరం" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంగళవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కమిషనర్ శైలజ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బోడుప్పల్ నగరపాలక సంస్థలో బుధవారం నుండి 14వ వార్డులో క్షయ వ్యాధి పరీక్షలు ఇంటింటికి తిరిగి నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించే సిబ్బందికి పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శ్యాం సుందర్ రావు, డిస్టిక్ అండ్ లెప్రసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, యు.పి.హెచ్.సి బోడుప్పల్ డాక్టర్.నరేష్, ప్రాజెక్టు సీనియర్ మేనేజర్ శశికాంత్ నాయక్, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.