11-11-2025 06:52:24 PM
జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలి..
గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు..
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రిపోర్టర్ చింత వెంకన్నకు గాల్ బ్లాడర్ స్టోన్స్ సర్జరీ చికిత్స జరిగిందని తెలుసుకొని, అనంతరం ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న చింత వెంకన్నను మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని, వైద్యుల సూచనల ప్రకారం సమయానుసారం మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవాలని తగు సూచనలు తెలిపారు. వారి వెంట మరిపెడ మున్సిపల్ మూడో వార్డు మాజీ కౌన్సిలర్ రేఖ లలిత వెంకటేశ్వర్లు, వీరబోయిన మురళి, కొక్కు సునీల్, చింత వెంకన్న కుటుంబ సభ్యులు తదితరులున్నారు.