పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు అదృశ్యం..
11-08-2025 07:42 PM
రాజాపూర్: పెన్షన్ డబ్బుల కోసం వెల్లి వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన ఈ నెల 1న చోటుచేసుకుంది. ఎస్సై శివానంద్ గౌడ్(SI Shivanand Goud) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన మల్లెపగ వెంకటమ్మా అనే వృద్ధురాలు ఈ నెల 1న పక్క గ్రామం రాజాపూర్ మండల కేంద్రానికి వచ్చింది. పెన్షన్ డబ్బుల కోసం సాయంత్రం వరకు మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ కార్యాలయం దగ్గర ఉన్నట్లు తెలిపారు. ఆరోజు నుండి వృద్ధురాలు ఇంటికి రాలేదు. కుమారుడు వెంకటేష్ తన తల్లి కోసం స్నేహితులు, బంధువులకు ఇంటికి వెల్లి వెతికిన ఆమె ఆచూకీ తెలియలేదు. దీనితో సోమవారం కుమారుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






