calender_icon.png 11 August, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ పేరుతో టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ

11-08-2025 07:45:24 PM

రూ. 90 ఉంటే 140 వసూళ్లు..

ఇదేమిటని ప్రశ్నిస్తే పండుగ స్పెషల్ అంటున్నా కండక్టర్..

ప్రయాణికుల ఆవేదన..

దౌల్తాబాద్: పండుగల పేరుతో ఆర్టీసీ(RTC) ప్రయాణికుల వద్ద అదనపు చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తే పండుగ స్పెషల్ అంటూ టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రయాణికులు వాపోయారు. రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన ఉడిది సాగర్ సోమవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు టికెట్ తీసుకోగా రూ.140 కండక్టర్ టికెట్టు ఇచ్చాడు. అయితే సికింద్రాబాద్ నుంచి ప్రజ్ఞాపూర్ టికెట్ ధర రూ.90 ఉండగా రూ.140 రూపాయలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని సాగర్ కండక్టర్ ను ప్రశ్నించారు. పండుగ స్పెషల్ బస్సులు నడుపుతున్నామని టికెట్ ధర అంతే ఉంటుందని కండక్టర్ తెలుపగా ఆయనతో కొద్దిసేపు వాదించాడు.

శనివారం పండుగ జరగగా సోమవారం కూడా ఆర్టీసీ బస్సులు అదనపు చార్జీలు వసూలు చేసి ప్రయాణికులను మరింత అసౌకర్యానికి గురి చేస్తున్నట్లు సాగర్ పేర్కొంటున్నాడు. మహిళలకు ఉచితంగా సౌకర్యం ఏర్పాటు చేయగా తమకు ఉన్న టికెట్ ధర కంటే అదనంగా స్పెషల్ బస్ పేరిట వసూలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు అంటే ఇదేనా ప్రయాణికుల వద్ద అందినకాడికి అదనపు బస్సుల పేరుతో వసూలు చేయడం దారుణమన్నారు. ఈ విషయంలో ఆర్టీసీ ఉన్నత అధికారులు చొరవ చూపి స్పెషల్ బస్సుల పేరీట అదనంగా టికెట్ ధర వసూలు చేయడానికి అదుపు చేయాలని ఆయన పేర్కొన్నారు. సామాన్యులు ఆర్టీసీ ప్రయాణం చేయడానికి జంకుతున్నారు.