calender_icon.png 11 August, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ

11-08-2025 07:40:14 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, ఆరోగ్య రక్ష కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) అన్నారు. సోమవారం దామరవంచ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌లో ఎమ్మెల్యే  డాక్టర్ మురళి నాయక్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రత, సంక్షేమం కోసం అనేక కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని, ముఖ్యంగా గిరిజన గ్రామాలలో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపు, ముందస్తు నిరోధక చర్యలను విస్తృతంగా అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్  సారంగం, స్థానిక వైద్యాధికారి డాక్టర్ యమున, ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్ ప్రిన్సిపల్ రమేష్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, సూపర్వైజర్ కేఎల్ఎన్ స్వామి, గోపీచంద్, లోకియా, హెల్త్ అసిస్టెంట్ సర్దార్, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.