14 April, 2026 | 1:44 AM

ఏకగ్రీవ ఆమోదంతో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక

14-04-2026 12:29 AM

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని: ఎమ్మెల్యే కోరం

ఇల్లందు, ఏప్రిల్ 13 (విజయక్రాంతి):  ఇల్లందు మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ఏకగ్రీవ ఆమోదంతో ఎన్నికైన కోఆప్షన్ సభ్యులు ప్రత్యేక పరిజ్ఞానం కోటాలో మడుగు సాంబమూర్తి, పర్రె స్వర్ణలత, మైనారిటీ వర్గం నుంచి సయ్యద్ అజాం, ఎస్కే హసీనాలను కమిషనర్ గణేష్ ప్రమాణస్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా కోఆప్షన్ సభ్యులు పనిచేయాలని సూచించారు. అనంతరం నూతన సభ్యులను సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ పెండ్యాల రాజు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.